సమస్య మీది పరిష్కారం మాది * ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం * రాజకీయాలకు అతీత సమస్యలు పరిష్కా

Published: Tuesday December 06, 2022
వికారాబాద్ బ్యూరో 05 డిసెంబర్ ప్రజాపాలన : రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించడమే డయల్ యువర్ చైర్ పర్సన్ లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో భాగంగా 20 ఫిర్యాదులు వచ్చినవని స్పష్టం చేశారు. డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమం అనంతరం మీడియాతో చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్  మాట్లాడారు. డయల్ యువర్ చైర్ పర్సన్ విలువైన సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో గల అపరిష్కృత సమస్యల గురించి ప్రజలు తెలపాలని హితవు పలికారు. 24వ వార్డులో పార్కు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు పూర్తి చేయాలని, బ్రిలియంట్ స్కూల్ సమీపంలో ఉన్న బావిపై జాలి ఏర్పాటు కోసం చైర్ పర్సన్ దృష్టికి తెచ్చారు. 4వ వార్డులో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సూచించారని వివరించారు. 16వ వార్డులో మోరీలను శుభ్రం చేయాలని ఫిర్యాదు చేశారు. 27వ వార్డులో రోడ్లను ఆక్రమిస్తున్నారని చెప్పారు. 15వ వార్డులో మోరీలు నిండుకుండలను తలపిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. 18వ వార్డులో మోరీల నిర్మాణం, శుభ్రం చేయడం లేదన్నారు. కొత్తగడికి సంబంధించిన 12వ వార్డులో మ్యాన్ హోల్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆర్టిఓ కార్యాలయం సమీపంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. శివారెడ్డిపేట్ లో డస్ట్ పోసి గుంతలు పూడ్చాలని అడిగారన్నారు.ఒకటవ వార్డులో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 21వ వార్డులో అనుమతులు లేని డబ్బాలు వేసి రోడ్డు ఆక్రమించి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 4వ వార్డులో ఎర్రమట్టి, డస్ట్ వేయించాలని కోరారు. 5వ వార్డులో విద్యుత్ దీపాలు వెలగడం లేదని ధ్వజమెత్తారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయం దగ్గర రోడ్డు ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 6వ వార్డులో మహవీర్ ఆసుపత్రికి వెళ్ళే రహదారి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో రాజకీయ, అప్రస్తుత విషయాల గురించి ప్రశ్నించరాదని సవినయంగా కోరారు. కాలయాపన కోసమే డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయరాదని విజ్ఞప్తి చేశారు.