సురభీ వాణిదేవి గెలుపు తథ్యం

Published: Tuesday March 09, 2021
- గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి విద్యావంతురాలు సురభీ వాణి దేవిని ఈ ఎన్నికల్లో మనం గెలిపించు కుంటే మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనించడానికి మార్గం సుగమం అవుతుందని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా అన్నారు. గచ్చిబౌలి డివిజన్ ఖాజాగుడా తెరాసా పార్టీ కార్యాలయం నందు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దిశానిర్దేశంతో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ నెల 14వ తేదీన జరగబోవు పట్టభద్రులు ఎన్నికల్లో దేశాన్ని ఆపదలో ఆదుకున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె విద్యావంతురాలు సురభీ వాణి దేవి గెలుపుకు డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించి వాణి దేవిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. గచ్చిబౌలి డివిజన్ నాయకులు, ఎమ్మెల్సీ ఏరియా ఇంచార్జీలతో నిర్వహించిన ఈ అవగహన సమావేశంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ విప్లవ్ కుమార్, ఎమ్మెల్సీ పట్టుభద్రుల ఇంఛార్జి వాసల రమేష్, కరీంనగర్ కార్పొరేటర్ మహేష్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రాయదుర్గంహ విద్య కమిటీ మెంబర్ కృష్ణ, శ్రీ సోమేశ్వర దేవస్థాన చైర్మన్ చెన్నం రాజు ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, నాయకులు శ్రీను పటేల్, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, తెరాస నాయకులు, గచ్చిబౌలి డివిజన్ ఏరియా, ఇంచార్జీలు పాల్గొనడం జరిగింది.