కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సి పి ఎం

Published: Friday September 09, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిస్కృత సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి సంకే రవి తెలిపారు.
 ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు న్నారని,
కనీస వేతనాల అమలు,పనిలో భద్రత  కల్పించుటలో రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలం మయ్యాయని,నిత్యం కాంట్రాక్టు కార్మికులు కాంట్రాక్టర్ల,యాజమాన్యాల చేతుల్లో మోసపోవడం జరుగుతుందని,  చేసిన పనికి సకాలంలో వేతనాలు  చెల్లించడం లేదని అన్నారు.
కాంట్రాక్టు కార్మికుల సంఘాలు అనేక దఫాలుగా కార్మికుల సమస్యలను
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల,
సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లిన,  మాటలతో కాలాయాపన చేస్తున్నారే కానీ
 సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి చెయ్యడం లేదని అన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,
సింగరేణి యాజమాన్యం తక్షణమే కాంట్రాక్టు కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 
సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంట్రాక్టు కార్మికులు  సమ్మెలో పాల్గొనలని  కార్మికులకు అండగా సిపిఎం పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు. 
ఈ సమావేశంలో సంకే రవి, జిల్లా కార్యదర్శి, గుమాస అశోక్, ఏ,రమణ, సి హెచ్,దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.