తెలుగుదేశం పార్టీబెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ గా ఆమానుల్లాకాన్ నియామకం పెద్దపల్లి పార

Published: Monday December 12, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 11 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా అమ్మానుల్లాకాన్ను నియమించినట్లు ఆ పార్టీ పెద్ద పెల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు సంజయ్ తెలిపారు.
ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు,
 బెల్లంపల్లి నియోజవర్గ  టిడిపి  పార్టీ కన్వీనర్ గా ఆమానుల్లాఖాన్ను  నియమించినట్టు తెలిపారు. 
 ఈ 21న చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఖమ్మం లో జరిగే   బహిరంగసభ ను విజయవంతం చేయాలని, గడప గడపకు  టిడిపి ప్రజల కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ టిడిపి పార్టీని  బలోపేతం చేయడానికి, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. 
ఈ కార్యక్రమం లో టిడిపి పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దపల్లి సత్యనారాయణ, టి, మణిరాం సింగ్, చింతల రమేష్, పాండే, పలువురు మహిళా కార్యకర్తలు , నాయకులు, పాల్గొన్నారు.