ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలి.వైరా ఏసిపి రెహమాన్

Published: Wednesday November 30, 2022

మధిర  నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని వైరా ఏసిపి రెహమాన్ పోలీసులకు సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీలలో భాగంగా మధిర టౌన్ పోలీస్ స్టేషన్ మరియు మధిర సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. దీనిలో భాగంగా పలు రికార్డులను, ఫైళ్లను, కేసులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం ఎన్నో కఠిన సవాళ్లు ఉన్నాయని తదనుగుణంగా పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ విధంగా విధులు నిర్వహించాలో అనే దానిపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మధిర సీఐ మురళి టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.