కేసీఅర్ ది దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం

Published: Saturday September 24, 2022
వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
వికారాబాద్ బ్యూరో 23 సెప్టెంబర్ ప్రజాపాలన : 8 ఏళ్లుగా కేసీఅర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం నవాబుపేట్ మండల పరిధిలోని మమ్మదాన్ పల్లి గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట ముచ్చట్లు ఆడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల మాట్లాడుతూ కేసీఅర్ అమలు చేస్తామని చెప్పిన ప్రతి పథకం మోసమేనని ఘాటుగా స్పందించారు. ఇచ్చిన ఒక్క మాట కూడా కేసీఅర్ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 5 వేలు రైతు బంధు ఇచ్చి రైతులను కోటీశ్వరులు చేశామని చెబుతున్నారని దెప్పిపొడిచారు. వ్యవసాయానికి 30 వేల సబ్సిడీ పథకాలను కేసీఅర్ బంద్ పెట్టాడని స్పష్టం చేశారు. హాస్టళ్లలో పురుగులు ఉన్న బియ్యాన్ని వండి పిల్లలకు పెడుతున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ పథకాలను అన్ని బంద్ పెట్టఢంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదని విమర్శించారు. మళ్ళీ వైఎస్సార్ పాలన తెలంగాణ గడ్డ మీద రావాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కో ఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ కో ఆర్డినేటర్ సుధారాణి వికారాబాద్ జిల్లా వైఎస్ఆర్ టిపి అధ్యక్షుడు మామిడి సంగమేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధులు కావలి వసంత్ కుమార్ పాపగారి రమేష్ అధికార ప్రతినిధి నాగరాజు మహిళా నాయకురాలు రజినీ వికారాబాద్ మండల ప్రతినిది గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి పరిశీలకులు బండారు అంజన్ రాజు  నియోజక వర్గ పరిశీలకుడు నాడెం శాంతా కుమార్ తదితర వైఎస్సార్ టిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area