లూర్దుమాతలో లావాదేవీలపై అవగాహన సదస్సు..

Published: Saturday September 17, 2022
తల్లాడ, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన న్యూస్):
 
 *తల్లాడలోని స్థానిక  లూర్ధుమాత పాఠశాలలో శుక్రవారం నాబార్డ్ ఆధ్వర్యంలో డిజిటల్ లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రకథ ద్వారా కళాకారులు విద్యార్థులకు బ్యాంకు యొక్క ప్రయోజనాల గురించి వివరించారు.ఈ  కార్యక్రమానికి తల్లాడ డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ రమ్యశ్రీ, సూపర్వైజర్ ఓం ప్రకాష్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి అకౌంటు ఉండాలని, బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు, ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష యోజన పథకాల గురించి విద్యార్థులకు వివరించారు. బ్యాంకు ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరించిన కళాకారులకు లూర్దుమాత స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ జసింత మేరీ  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు కౌన్సిలర్ మురళి మోహన్ రావు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.*