టాప్ టెన్ ఉత్తమ చిత్రాలలో "రైతు ఆత్మకథ" చిత్రం

Published: Monday October 18, 2021
మధిర, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన మధిరలోని ఖాజీపురం గ్రామానికి చెందిన "ఎ.ఆర్.సమీర్" దర్శకత్వంలో "శోభన్ భోగరాజు" ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న "రైతు ఆత్మకథ" చిత్రంటాప్ టెన్ ఉత్తమ చిత్రాలలో ఎంపికపైమొగిలి గుణకర్, శ్రీ మిత్రా గ్రూపు, శ్రీ అభయ హస్పిటల్" వారు సంయుక్తంగా నిర్వహించిన ఖమ్మం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం అయ్యి "జబర్దస్త్ రాజమౌళి" గారి చేతుల మీదుగా ఎ.ఆర్.సమీర్ ప్రశంసా పత్రాన్ని అందుకోవటం జరిగింది ఈ చిత్రానికి "శ్రీమతి. యమునా నామా" కథ అందించగా" ఎ.ఆర్.సమీర్"స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కెమెరా, దర్శకత్వ బాధ్యతలు చేపట్టగామిధున్ నామా" ఎడిటింగ్ చేసారు ఈ కార్యక్రమంలో ఎ.ఆర్.సమీర్ టీం సభ్యులు ప్రవీణ్ చిన్నా, సాయిబాబు, గోసవీడు అంజి కూడా పాల్గొన్నారు.