పొన్నెకంటి సంజీవ రాజు జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం

Published: Monday July 12, 2021
ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత రత్నఅంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్
పొన్నెకంటి సంజీవ రాజు సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం !
భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మద్దెల శివ కుమార్
కొత్తగూడం, భద్రాద్రి, కొత్తగూడం జిల్లా, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : దివంగతులైన కన్నతండ్రి పేరుమీద సత్యం మెమోరియల్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రతి నెల 2.3 అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు పాత కొత్తగూడెం అర్బన్ హెల్త్ సెంటర్ కో ఆర్డినేటర్ గా కోవిడ్ మొబి లై సింగ్ ఆఫీసర్ గా కరోనా ఉపద్రవం నుండి అహర్నిశలు శ్రమిస్తూ విశిష్టమైన కోవిడ్ సేవలను అందిస్తున్న పొన్నెకంటి సంజీవ రాజు సామాజిక సేవలు అభినందనీయమని వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్ ఉద్ఘాటించారు 11 07 2021 నాడు పొన్నెకంటి  సంజీవ రాజు జన్మదినం సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో సత్యం మెమోరియల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది నిరుపేదలకు బిర్యానీ పొట్లాలను మంచి నీటిని అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నమద్దెల  శివ కుమార్ మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం గొప్పదని ఆకలితో కడుపు మాడుతున్న వాడికి ఇంత అన్నం పెట్టి కడుపు నిండితే అప్పుడు అతడు ఇతర విషయాల మీద మనసు లగ్నం చేస్తాడని అటువంటి అన్నదానాలు నిరంతరం కొనసాగిస్తూ సంజీవ రాజు అన్నదానాలసంజీవ రాజుగా పేరు ప్రఖ్యాతులు గడి స్తున్నాడని కన్న కొడుకులు తండ్రి ఆస్తులకు వారసులుగా ఉంటారు తప్ప ఆశయాలకు కాదని అటువంటి సంజీవ రాజు తన శిష్యుడు కావడం ఎంతో గర్వకారణమని మద్దెల ఆనందం వ్యక్తం చేశారు సంజీవ రాజు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి సామాజిక సేవలు ఇంకా విస్తృత పరచాలని మద్దెల ఆకాంక్షించారు ఈ అన్నదాన కార్యక్రమంలో మద్దెల మరియు పొన్నెకంటి సంజీవ్ రాజు తో పాటు సత్యం మెమోరియల్ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీమతి జయమ్మ కార్యదర్శులు పుత్రిక రత్నాలు సమతా మరియు వర్షిత భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు జనరల్ సెక్రెటరీ మంద హనుమంతు సలహాదారులు కోలపూడి ధర్మరాజు ఉప సర్పంచ్ దుర్గేష్ ప్రచార కార్యదర్శి లావుడియా సత్యనారాయణ సుక సురేష్ శ్రీనివాస్ యాదవ్ భాను తదితరులు పాల్గొన్నారు