ఉచిత గాలికుంటు టీకాలు నివారణ కార్యక్రమం

Published: Thursday October 07, 2021
బోనకల్, ప్రజాపాలన ప్రతినిధి, అక్టోబర్ 6 : మండలంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాలు కార్యక్రమం అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మండలంలో ప్రతి గ్రామమునందు నిర్వహించబడుతుంది. ఈ వ్యాధి సోకిన గేదెలు, ఆవులకుపాల దిగుబడి తగ్గుట మరియు పని సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. కావున మండల గ్రామాలలోని రైతులు గమనించి ఆర్థికంగా నష్టపోకుండా ప్రతి ఒక్కరూ తమ పశువులకు గాలికుంటు టీకాలులను తప్పకుండా వేయించాలని బోనకల్ పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆళ్ళ పాడు గ్రామంలో సర్పంచ్ మర్రి తిరుపతి రావు ఆధ్వర్యంలో గేదెలకు, ఆవులకు టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోనకల్ పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, వి ఎల్ ఓ గోపాల్ రావు, నాగేందర్, చిన్నయ్య, ప్రసాద్ మరియు గోపాల మిత్రా లు అశోక్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు.