ఉపకార వేతనాల కొరకు దరఖాస్తు స్వీకరణ తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఇన్చార్జ్ కమీషనర్ ఈ. గంగా

Published: Thursday January 19, 2023
  మంచిర్యాల భ్యూరో‌, జనవరి 18, ప్రజాపాలన :
 
తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా దుకాణములు, వాణిజ్య సంస్థలు, కర్మాగారములు, మోటారు, రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక, ఇతర ట్రస్టులలో పని చేయుచున్న కార్మికుల పిల్లలు, కార్మికులు 2021-22 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు కొరకు ఫిబ్రవరి 15వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఇన్చార్జ్ కమీషనర్ ఈ. గంగాధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారములు సంబంధిత, సహాయ కార్మిక కమీషనర్ కార్యాలయంలో అందుబాటులో ఉ న్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 15వ తేదీ లోగా సంబంధిత కార్మికశాఖ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. 10వ తరగతి, ఐ.టి.ఐ. ఉత్తీర్ణులైన వారికి 1 వేయి రూపాయలు, పాలిటెక్నిక్ వారికి 1 వేయి 500 రూపాయలు, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బి.ఎస్.సి. (అగ్రికల్చర్), బి.ఎస్.సి. (వెటర్నరి), బి.ఎస్.సి. (నర్సింగ్), బి.ఎస్.సి. (హార్టికల్చర్), బి.సి.ఎ., ఎం.సి.ఎ., బి.ఫార్మసి, ఎం.ఫార్మసి, బి.బి.ఎ., ఎం.బి.ఎ., డిప్లమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్, పి.జి. డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ వారికి 2 వేల రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులను వారి కోర్సులలో మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనాలను సంబంధిత సహాయ కమీషనర్లు మే డే నాటికి లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.