లంబాడీలను ఎస్టీల నుండి తొలగించాలి * తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ ** జిల్లా కేం

Published: Wednesday September 21, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 20 (ప్రజాపాలన, ప్రతినిధి) : లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలగించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని తిర్యానీ నుండి చేపట్టిన చలో జోడేఘాట్ యాత్ర ఐదవ రోజు జిల్లా కేంద్రానికి చేరుకోగా, అంబేద్కర్ చౌక్ వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కొట్నాక విజయ్ మాట్లాడుతూ చట్టబద్ధత లేని లంబాడీలను దేశం మొత్తం ఎస్టీలలో కలుపుదామని చెప్పడం దారుణం అన్నారు. సీఎం కేసీఆర్ ఆదివాసి ప్రజలను అనిసి వేసే కుట్రతో ఉన్నాడని, 10 శాతం రిజర్వేషన్ అంటూ ఓట్ల కోసమే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించాలని అన్నారు. అంతేగాని రిజర్వేషన్ ల పేరిట ఆదివాసీ గిరిజనులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేయవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసి మహిళ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన అప్పుడు ఆదివాసి మహిళ కు మద్దతు ఇవ్వకుండా ఉండి, ఇప్పుడు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకూ  ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ జిల్లా అధ్యక్షుడు  వెంకటేష్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి, ఉపాధ్యక్షుడు  కోవా విజయ్, నాయకులు ధర్మో, భగవంతరావు, సుభాష్, రాము తదితరులు పాల్గొన్నారు.