కాంగ్రెస్ పార్టీ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి జరిగింది మధిర

Published: Saturday February 04, 2023

మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ హయంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని 
టిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసాం అంటున్నారు  ఏంటి మీ అభివృద్ధి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ.మార్నింగ్ వాక్ పేరుతో తిరుగుతూ మధిరను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులారా ఏమి చేశారు మీరు మధిర అభివృద్ధి.ముఖ్యమంత్రి చెప్పిన 30 కోట్ల నిధులు ఎప్పుడు తీసుకు వస్తారు.గతంలో 16 కోట్ల తో అంబేద్కర్ సెంటర్ లో కేటీఆర్ గారితో శంకుస్థాపన చేసిన నిధులు ఏమి అయ్యాయి.మధిర పట్టణంలో 8 సంవత్సరాలుగా పునాదులకే పరిమితం అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఏంటి...?మధిర పట్టణం లో చిరు వ్యాపారుల 400 కోట్లు జేసీబీ లు పెట్టి తొలగించారు  వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి...?8 సంవత్సరాల క్రితం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం అని చెప్పిన మాటలు ఎం అయినాయీ..?సొంత స్థలం లో ఇళ్లు కట్టు కునే వారికి 3 లక్షలు ఇస్తాం అన్న మాట ఎం అయింది....?నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు అయింది దాని సంగతి ఏంటి...?మధిర పట్టణంలో రోడ్లు మొత్తం తవ్వి గుంటలుగా చేసి ప్రజలు నడవటానికి వీలు లేకుండా చేసింది మీరు కాదా.మధిర పట్టణానికి భట్టి విక్రమార్క డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తెస్తే దానికి నాలుగు లైట్లు పెట్టి మేము అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటున్నారుమధిర కు ట్యాంక్ బండ్ కావాలని పట్టు బట్టి తెచ్చింది భట్టి విక్రమార్క గారు ఆయన తెచ్చిన పనులు చేసుకుంటూ మేమే తెచ్చాము, చేస్తున్నామని చెప్పుకుంటున్నా రు.టిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసాం అంటున్నారు  ఏంటి మీ అభివృద్ధి అని అన్నారు.ఈ సమావేశంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *ధారా బాలరాజు* మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మాజీ సర్పంచ్ *బొమ్మకంటి హరిబాబు,* మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ కాంగ్రెస్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి* మొదలగు వారు పాల్గొన్నారు