చెన్నప్పకు సీనియర్ మాస్టర్ షీ టీం సర్టిఫికెట్ * జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

Published: Friday November 11, 2022

వికారాబాద్ బ్యూరో 10 నవంబర్ ప్రజా పాలన : ఆత్మ రక్షణకు శారీరకద్రత్వానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ బెల్ట్ సెవెంత్ డాన్ ట్రడిషనల్ జపాన్ షోటో కాన్ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు జాజుల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బి చెన్నప్ప కు సీనియర్ మాస్టర్ షీ టీం సర్టిఫికెట్ను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.