జాతీయ పురస్కారాన్ని అందుకున్న సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్

Published: Tuesday July 19, 2022

కోరుట్ల, జూలై 18 (ప్రజాపాలన ప్రతినిధి):
తెలుగు వెలుగు సాహితి వేదిక, స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో భాగంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న మహానంది జాతీయ పురస్కారం-2022 అవార్డును జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు ఆదివారం రోజున వేములవాడలో సంస్థ నిర్వాహకులు అందజేశారు. ఉమ్మడి  కరీంనగర్
జిల్లాలో గత 15 సంవత్సరాల నుండి రక్తదాన ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది యువకులను చైతన్యపరిచి అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న బాధితులకు అప్పన్న హస్తం అందిస్తూ ఈ ప్రాంతంలో రక్తం కొరత లేకుండా చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రక్తదాన విభాగంలో విశేష కృషి చేసినందుకు కటుకం గణేష్ కు జాతీయ పురస్కార్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక, స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్, కో-చైర్మన్ జొన్నగోని యాదగిరి గౌడ్, న్యాయ సలహాదారు కటుకం రాజేంద్రప్రసాద్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.