పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ .చెక్కులు అందజేసిన విప్ రేగా కాంతారావు.

Published: Wednesday January 04, 2023
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ 
 కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని, మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిఆర్ఎస్  ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116/- రూపాయల ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు,.రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళల కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసము షి టీమ్స్, గర్బినిలు, చిన్నారుల ఆరోగ్య కోసము ఆరోగ్య లక్ష్మి పథకం, బాలింతల చిన్నారుల కోసము కేసిఆర్ కీట్స్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టారు అని గుర్తు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు,ఎనిమిదిన్నర సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పైసా సహాయం చేయలేదన్నారు అభివృద్ధికి సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తున్న అన్నారు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం ఓర్వక లేక ఉచితాలు వద్దు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని మాట్లాడటం సరైనది కాదన్నారు బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగగొడితే వారి రుణాలు 12 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది అన్నారు బిజెపి పాలనలో ఆర్థిక వ్యవస్థ వెనుకబడుతుంది అన్నారు, ప్రజలు బిజెపికి తగిన బుద్ధి చెబుతారన్నారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల  తాసిల్దార్ సురేష్ బాబు, అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ, నెల్లిపాక సర్పంచ్  వెంకటరమణ , ఎంపీపీలు అశ్వాపురం సర్పంచ్  శారద, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు...