విద్యార్థుల భవిష్యత్తు మా లక్ష్యం: మిస్సైల్ మాన్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ

Published: Friday April 08, 2022
బోనకల్, ఏప్రిల్ 7 ప్రజాపాలన ప్రతినిధి: మిస్సైల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారిచే కె వి ఎం జడ్ పి ఎస్ ఎస్ ఆళ్లపాడు పాఠశాల నందు 10 వ తరగతి విద్యార్థి విద్యార్థులనకు పరిక్ష ప్యాడులు, పేన్నులు, నోటు బుక్ లు పంపిణీ చేశారు. అళ్లపాడు పాఠశాల నందు 10వ తరగతి చదువు తున్న విద్యార్థులకు సహాయం మా నేస్తం చిరునవ్వే మా లక్ష్యం అనే నినాదంతో సంస్థ ఫౌండర్సు వి.నరేష్, ఏమ్.రమేష్, వి.క్రిష్ణ, షేక్ జానీమీయా, జి ఉదయ్ కూమార్ లు లక్ష్యం కోసం సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నారు. చిన్న దైన లక్ష్యం పేద్దగా ఉండాలి చేసే సహాయం విద్యార్థుల భవిష్యత్తు కోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు. ప్రధానోపాధ్యాయులు రమేష్ అధ్యక్షతన సర్పంచ్ మర్రి తిరుపతిరావు చేతులు మీదగా పరిక్షలకు అవసరమైన 6 రకాల బ్యాగ్ కిట్టును అందజేశారు. సంస్థ వారిని సర్పంచ్ మర్రి తిరుపతిరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్స్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.