అగ్నిప్రమాదంతో దగ్దమైన మామిడితోటలు

Published: Thursday May 27, 2021
పరిశీలించిన తహశీల్దార్ పి.నవిన్ కుమార్
​గొల్లపల్లి, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లి మండలం తిరుమలపురం (మల్లన్నపేట) గ్రామ శివారులో మరియు జగిత్యాల మండలం ధర్మారం గ్రామ శివారులో నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పొలాల్లో నుండి మంటలు వడగాలికి ఈరోజు కూడా చెలరేగుతూ మామిడి తోటలోకి మంటలు చెలరేగి ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మీ 80 మామిడిచెట్లు నెరేళ్ల రాజగౌడ్15 మామిడి చెట్లు నాగుల సురేందర్ 25 మామిడి 40 టేకు చెందిన రైతులకు చెందిన 4 ఎకరాల పైన పంట కాయలు పూర్తిగా దగ్దం అవగా ఇట్టి విషయం సర్పంచ్ నెరేళ్ల గంగారెడ్డి ఫైర్ శిబ్బంది తెలిపి ఆర్పే చర్యలు చేపట్టారు. సర్పంచ్ ద్వారా తెలుసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పి.ఏ సంబంధించిన తహశీల్దార్ ఎంపీపీ, జడ్పీటీసీ తెలియజేయగా స్పందించి ఉదయం గొల్లపల్లి తహశీల్దార్ పి.నవీన్ కుమార్ వారి సిబ్బంది జగిత్యాల గ్రామీణ ఆర్ఐలు క్షేత్ర స్థాయిలోమొఖాపైవెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పంచనామా చేసారు. నివేదికను  కలెక్టర్  పంపిస్తామని నష్టపోయిన రైతులకు తెలియజేయడం జరిగింది. తక్షణమే స్పందించిన అందరికి ఏఎంసి వైస్ ఛైర్మన్ బోయపోతు గంగాధర్ రైతులు కృతజ్ఞతలు తెలియజేసి సంబంధిత రైతులను ప్రభుత్వం అదుకొని నష్టపరిహారం వచ్చేలా చూడాలని కోరారు.