భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన

Published: Saturday June 26, 2021
ఇబ్రాహీంపట్నం, జూన్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా శుక్రవారం మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీ సంకెళ్ళతో నిరసనతెలియజేసారు. 1975 జూన్ 25న మొదలైన ఎమర్జెన్సీ 21 నెలలు కొనసాగింది. నాడు జన సంఘ్ పేరుతోఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను సామాన్య జనాలను ఇబ్బందులకు గురిచేస్తూ ఇందిరా గాంధీ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అత్యవసర పరిస్థితి విధించి అరాచకానికి గురిచేశారు, భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా ఎమర్జెన్సీ చీకటి పాలనగురించి ప్రజలకు వివరించి భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామిక విలువలు కాపాడేందుకు కృషిచేస్తుంది. ఈకార్యక్రమంలో ఇబ్రహీంపట్నం బీజేపీ అధ్యక్షులు బట్టు జక్రయ్య, ఉపాధ్యక్షులు ఉడుత రాజు, కార్యదర్శి సావర్తి వేణు గోపాల్, కోశాధికారి సుంచు రణధీర్, బీజేవైయం మండల అధ్యక్షులు బోడ నవీన్ రెడ్డి, జగిత్యాల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తీగల శ్రీధర్ రెడ్డి, దళిత మోర్చా కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, చాట్ల రాజేందర్, గోపు రాజు తదితరులు పాల్గొన్నారు.