వికారాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గా మాచిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఎన్నిక

Published: Tuesday September 20, 2022
వికారాబాద్ బ్యూరో 19 సెప్టెంబర్ ప్రజా పాలన : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు నియమాలకు కట్టుబడి నిస్వార్థ సేవ చేసిన నాయకులకు పార్టీ పరంగా తగిన గుర్తింపు లభిస్తుందని బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మోమిన్ పేట మండల పరిధిలోని వెల్చాల్ గ్రామ సర్పంచ్ మాచిరెడ్డి లక్ష్మమ్మ కుమారుడు మాచిరెడ్డి మధుసూదన్ రెడ్డిని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అసెంబ్లీ కన్వీనర్ గా ఎన్నికైన మాచిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పార్టీ అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్విరామంగా క్రమశిక్షణతో కొనసాగిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన బలపడే విధంగా అహర్నిశలు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తను సమన్వయ పరుస్తూ ఐకమత్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ ను అసెంబ్లీకి పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాగోస బిజెపి భరోసా పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం కలిగిందని చెప్పారు. రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ మీ సమస్యపై నా పోరాటం గ్రామ గ్రామాన ప్రేరణ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటి గారి శివరాజ్, అమరేందర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్, రాఘవ నాయక్, రాజేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి , సురేష్ , వివేకానంద రెడ్డి, నరేందర్ రెడ్డి, బుచ్చి రెడ్డి తదితర  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.