రాపల్లిలో టిఆర్ఎస్ వ్యతిరేక వర్గం నాయకుడు పై హత్యాయత్నం

Published: Monday September 19, 2022
 బోనకల్, సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోనే రాపల్లి గ్రామంలో సర్పంచ్ వర్గం ఆదివారం రెచ్చిపోయింది. తన పార్టీలోనే ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అందరూ ఊహించినట్లుగానే రాపల్లిలో సంఘటన జరిగింది. బాధితుడు చల్లా బాబురావు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోనే రాపల్లి గ్రామపంచాయతీ టిఆర్ఎస్ చేతులో ఉంది. టిఆర్ఎస్ జిల్లా నాయకుడు మందడపు తిరుమలరావు సర్పంచ్ గా ఉన్నాడు. రెండు సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ లో రెండు వర్గాలు అయ్యాయి. తిరుమలరావు వ్యవహార శైలిపై విసుకు చెంది కొంతమంది టిఆర్ఎస్ లోనే మరో వర్గంగా తయారయ్యారు. దీంతో సర్పంచ్ వర్గం మరో వర్గంపై కత్తుల దూచుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో తిరుమలరావు వ్యతిరేక వర్గానికి చెందిన టిఆర్ఎస్ చెందిన చల్లా బాబురావు గ్రామంలోనే రామాలయం వీది నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో బెజవాడ శ్రీను, చల్లా చిట్టిబాబు ఘర్షణ పడుతున్నారు. చల్లా బాబురావు ను చిట్టిబాబు చూసి ఒక్కసారిగా బూతులు తిట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో చిట్టిబాబు మద్యం మత్తులో ఉండటం తో గొడవ ఎందుకులే అని పట్టించుకోకుండా చల్ల బాబురావు తన ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో చిట్టిబాబు సోదరులు చల్లా నవీన్, చల్ల సుధాకర్ మోటార్ సైకిల్ మీద సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిద్దరు మోటార్ సైకిల్ తో బాబూరావుని బలంగా డి కొట్టారు. దీంతో బాబురావు కింద పడిపోయాడు. వెంటనే చిట్టిబాబు రాయి తీసుకొని బాబురావు పై వేశాడు. ఆ తర్వాత చిట్టిబాబు తండ్రి కుటుంబరావు కూడా అక్కడికి చేరుకున్నాడు. నవీన్, సుధాకర్, కుటుంబరావు ముగ్గురు కలిసి బాబురావుని కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టారు. వారి ముగ్గురు కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులు చల్లా నరేష్, గంగదేవుల నరసింహ, పెనుగొండ ఆంజనేయులు, చల్లా శ్రీను మరికొందరు అడ్డుకున్నారని తెలిపాడు. తనను చంపే ప్రయత్నం విఫలం కావడంతో నవీన్ ఆవేశంతో నాపై పడి ఎడమ చెవిని కొరికితేంపాడని బాబురావు తెలిపాడు. దీంతో చల్లా బాబురావు తీవ్ర రక్తస్రావం కావడంతో కింద పడిపోయాడు. స్థానికుల సహాయంతో బోనకల్ పోలీస్ స్టేషన్ కు చల్ల బాబురావు చేరుకున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. తాను తిరుమల రావు వర్గానికి వ్యతిరేకంగా ఉన్నందునే పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని తనను హత్య చేసేందుకు తిరుమల రావు వర్గం ఈ ఘాతకానికి తెగబడిందని బాధితుడు బాబురావు తెలిపాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు.