*అంధుల జీవితాల్లో కంటి వెలుగుతో 'కాంతి'*

Published: Tuesday February 21, 2023

-కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోండి.


-ఎమ్మెల్యే కాలే యాదయ్య.
చేవెళ్ల సర్పంచ్ శైలజ రెడ్డి.

-చేవెళ్లలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.

చేవెళ్ల ఫిబ్రవరి 20'(ప్రజాపాలన):-

రాష్ట్రంలో అందత్వం లేకుండా చేయడమే కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.చేవెళ్ల గ్రామ పంచాయతి కార్యాలయంలో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి,స్థానిక సర్పంచ్ శైలజ ఆగి రెడ్డి,జెడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి,ఎంపీటీసీ గుండాల రాములు తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు.  పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రారంభం నుంచి సోమ వారం వరకు చేవెళ్ల డివిజన్ లో 19743 మందికి కంటి పరీక్షలు చేశారని 2749 మందికి కళ్లద్దాలు అందజేశారని తెలిపారు. కంటి సమస్యతో బాధపడుతున్న 2200 మందికి మందులు ఉచితంగా పంపిణీ చేశామనీ తెలిపారు.  అంధత్వ రహిత  రాష్ట్రమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు.
సర్పంచ్ మాట్లాడుతూ..... 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలి అన్నారు. పెద ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్న వారు పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేని వారికి కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందత్వ రహిత చేవెళ్ల గ్రామాన్ని నిర్మించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో దామోదర్, ఎంపీడీవో రాజ్ కుమార్,డిసిసి ఉపాధ్యక్షుడు బండారి ఆగి రెడ్డి,దేవర సమతా రెడ్డి, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, అత్తెలి రవీందర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, సి హెచ్ ఓ గోపాల్ రెడ్డి,మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, సత్తయ్య,కంటి వెలుగు వైద్య నిపుణులు ఆశ వర్కర్లు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.