దళిత బంధుకు నిధులు పెంచాలి

Published: Tuesday March 08, 2022

ఇబ్రహీంపట్నం మార్చ్ 7 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర శాసన సభలో రాష్ట్ర ఆర్దీక మంత్రి తన్నీరు హరీష్ రావు 2022.23 సం.గాను ప్రవేశపెట్టిన రాష్ట్ర మొత్తం బడ్జెట్ 2,56,958.51 కోట్ల రూ.లకు గాను 33,937, కోట్ల రూ. లు కోట్లు సుమారు 24 శాతం షెడ్యూల్ కులాల ప్రత్యేక అభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్)రంగా రెడ్డి జిల్లా కమిటీ తెలిపింది. ఈ మేరకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.సామెల్ గారు మాట్లాడుతూ... దళిత బంధు కోసం 17.700 కోట్ల రూపాయల కేటాయించడం వల్ల దాని లక్ష్యం నెరవేరదని అందుకోసం దళిత బంధుకోసం కనీసం 30వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా కేవలం గులాబీ కార్యకర్తలకే కట్టబెట్టే పద్ధతి కొనసాగుతుందని దానిని సవరించి  జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు 118 నియోజకవర్గాలలో 11,800 కుటుంబాలకు వచ్చే ఆర్దీక సంవత్సరం నాటికి 2లక్షల కుటుంబాల దళిత బంధు ఇస్తామంటేరాష్ట్రంలో 18లక్షల కుటుంబాలకు దళిత బంధు దక్కాలంటే ఇంకా ఎంత కాలం పట్టాలని ప్రశ్నించారు. తక్షణమే అర్హులందరికీ దళిత బంధు వచ్చే విధంగా బడ్జెట్ నిధులు పెంచాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది గత7ఏండ్లలో 86 వేల కోట్ల రూపాయలు ఎస్సి ప్రత్యేక అభివృద్ధి క్రింద కేటాయించి 55వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిందని అంటే సుమారు 31వేల కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా మురిగిపోయాయని చెప్పారు ఆ నిధులను ఈ వార్షిక బడ్జెట్ లోకలిపి ఖర్చు చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది .3ఎకరాల భూమి కోసం బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం అంటే ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేస్తుందా అనే అనుమానం కలుగుతుoదన్నారు. ఎస్సి కార్పోరేషన్ రుణాల కోసం తగినన్ని నిధులు కేటాయించి ఏ రకమైన షరతులు లేకుండా నేరుగా అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని చెప్పారు పెరుగుతున్న ధరలకనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మేస్ చార్జీలు పెంచాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది జీ ఓ నెంబర్ 342 ను సవరించి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది ప్లాన్ క్రింద కేటాయించిన ప్రతీ పైసా దళితుల మౌలిక ప్రత్యక్షప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. దారి మళ్లించకుండా కొత్తవిదిoచకుండా చిత్తశుద్ధి తో అమలు చేయాలని కేవీపీఎస్ డిమాండ్