వాజ్పేయి 96వ జయంతి వేడుకలు

Published: Saturday December 26, 2020

బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్పేయి 96వ జయంతి వేడుకలు* రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్పేట్ కార్పొరేషన్ మీర్పేట్ కార్పొరేషన్లో  బిజెపి నేతలు మాజీ ప్రధానమంత్రి  వాజ్పేయి 96వ జయంతిని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్పొరేషన్ లో బిజెపి నేతలు మాట్లాడుతూ.... భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి రాజకీయ యోధుడు, రాజనీతిజ్ఞుడు, అజాత శత్రువు, ఉదారవాద నేత, అనితర సాధ్యుడు భారతరత్న, పద్మ విభూషణ్  మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి నీ కొనియాడారు.

చిత్రపటానికి పూలమాల వేసి భారత్ మాతాకు జై నినాదాలతో హోరెత్తించి నివాళులర్పించారు. మీర్పేట్ కార్పొరేషన్లో రక్త శిబిరము ఏర్పాటుచేసి రక్తదానం జయంతి సందర్భంగా పలువురు ఇచ్చారు. బాలాపూర్ లో రాష్ట్ర నాయకుడు కిసాన్మోర్చా ప్రధాన కార్యదర్శి మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్  రెడ్డి మాజీ ప్రధాని వాజ్ పై చక్కగా ప్రజలకు బోధిస్తూ నిరు పేదలకు పండ్లు పలహారాలు పంచిపెట్టారు.మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ అటల్ బీహార్ వాజ్పేయి దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, బీజేపీ నేతలు కాలనీవాసులు వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అభిమానులు బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.