బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణను కార్మికులందరూ ఐక్యంగా ఎదుర్కోవాలి సింగరేణి కాలరీస్ లేబర్ యూన

Published: Wednesday June 29, 2022
బెల్లం పల్లి 20 ఎనిమిది ప్రజా పాలన ప్రతి నిధి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయటానికి కుట్రలు పన్నుతున్నాయని కార్మిక వర్గం సమిష్టిగా ఎదుర్కొని ప్రైవేటీకరణను ఆపు కోవాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ రాష్ట్ర  కార్యదర్శి టి, మనీ రామ్ సింగ్ అన్నారు.
మంగళవారం బెల్లంపల్లి లోని సివిల్ డిపార్ట్మెంట్లో నిర్వహించిన గేట్ మీటింగ్ లో మాట్లాడుతూ సింగరేణిలో రోజ రోజుకు ప్రైవేటీకరణ వేగవంతం అవుతుందని భూపాలపల్లి కేటీకే 8వ ఇంక్లైన్ గనిలో ఎస్ డి ఎల్ యంత్రాలను కాంట్రాక్టర్లకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నా రని, దీని కోసం టెండర్లు కూడా పిలిచిందని ఆరోపించారు, ఇప్పటికే బెల్లంపల్లి శాంతి ఖని, ఇందారం ఒకటవ గనిలో, ఎస్ డి ఎల్ యంత్రాలను ప్రైవేటు వారికి ఇవ్వాలని చూస్తుందని,  రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న  గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం  ప్రేక్షక పాత్ర వహిస్తుందని, టీబీజీకేఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పురుషులకు, మహిళలకు, సమాన వేతనాలు ఇవ్వాలని 12 గంటల  పని అమలు చేయాలని చూస్తోందని దీనివలన కార్మిక వర్గం నష్టపోతుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు నిలుపుదల చేయాలని టి ఎన్ టి యు సి డిమాండ్ చేస్తోందని అన్నారు. లేనియెడల అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కొత్త కార్మికులకు వ్యతిరేకంగా, తెచ్చే చట్టాలను రద్దు చేసే వరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.      
ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ సింగ్ తో పాటు బొల్లు మల్లయ్య , గంగాధర్ గౌడ్, గాండ్ల సదానందం, ఎండి హాసన్, ఈ, శంకరయ్య, సిహెచ్ రాజలింగు, గద్దల నారాయణ తదితరులు పాల్గొన్నారు.