కోతులు వల్ల పంట మొత్తం కొల్పయి రోధిస్తున్న సన్నకారు రైతులు

Published: Wednesday August 25, 2021

మధిర, ఆగష్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : రూరల్ మధిర దెందుకూరు గ్రామానికి చెందిన ఊట్ల రమేష్, రఘు అన్నదమ్ములు ఇద్దరు కలసి తమకు ఉన్న చేరి ఎకరం పొలంలో పెసర పంట వేసారు. వర్షాభావ పరిస్థితులు తట్టుకొని పెసర పంట బాగా పండింది ఎకరానికి 6 కింటాలు దిగుబడి వస్తది అని సొంతోష పడుతున్న తరుణంలో. గ్రామంలో మరియు పొల్లాలో ఉన్న కోతులు గుంపు వందల సంఖ్యలో ఒక్కసారిగా చేను మీద పడి పంట మొత్తం తిని ఆగం చేసినవి. పంట బాగా పండింది అని రైతులు సంతోష పడుతున్న తరుణంలో. నోటి కాడికి వచ్చిన పంట నేల పాలు అవటంతో వారి బాధ వర్ణనాతీతం. రైతులు ఇరువురూ రోదిస్తూ చెబుతున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి చిన్న సన్న కారు రైతులును కోతులు బెడద నుండి కాపాడాలి అని. అదే విదంగా చిన్న రైతులము అయిన మముల్ని ఆదుకోవాలి అని అధికారులును స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను