మధిర సి ఐ మురళి చేతుల మీదుగా " సైబర్ తీవ్స్" షార్ట్ ఫిల్మ్ విడుదల

Published: Wednesday March 29, 2023

మధిర, మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి: యువ నటుడు ప్రవీణ్ చిన్నా ప్రధాన పాత్ర లో నటించిన *సైబర్ తీవ్స్* షార్ట్ ఫిల్మ్ ను మధిర సి. ఐ తెలుగు అబ్బాయి చిన్నా యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. సి ఐ మాట్లాడుతూ సైబర్ నేరాల గురించి మంచి సందేశాన్ని అందించినందుకు నటుడు ప్రవీణ్ చిన్నా ని అభినందించారు.ఈ చిత్రం లో తేజస్వి, భాస్కర్ తదితరులు నటించగా కెమెరామెన్ వెంకట ప్రవీణ్, దర్శకత్వం అశోక్ కుమార్ అందించారు. ఈ కార్యక్రమం లో మధిర యువ దర్శకుడు ఎ.ఆర్.సమీర్, ఆర్ కే ఫౌండేషన్ చైర్మన్ దోర్నాల రామకృష్ణ , స్టార్ స్టూడియో మీరా తదితరులు పాల్గొన్నారు.