పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టండి ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి : జిల్లా కలెక్టర్ ఆ

Published: Tuesday July 06, 2021
పాలేరు జూలై 5 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా:-నేలకొండపల్లి పంచాయతీల్లో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ అధికారులకు సూచించారు. మండలంలోని ఆచార్లగూడెం లో పల్లె ప్రగతి పనులను సోమవారం పరిశీలించారు. పలువురు ఇండ్ల ను సందర్శించారు. ఇంకుడు గుంతలు తీసుకున్నారా... మొక్కలు నాటారా..... అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటా ఆరు మొక్కలు నాటాలని సూచించారు. హరితహారం కార్యక్రమం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటటమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అధికారులు సమన్వయంతో గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. ఆచార్లగూడెం గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను సర్పంచ్ రేగూరి శ్రావణ్ కుమార్, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించాలని ఎంపీడీఓ చంద్రశేఖర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రియాకం, తహశీల్దార్ తాళ్లూరి సుమ, ఎంపీడీఓ యం. చంద్రశేఖర్, మండల పంచాయతీ అధికారి నెల్లూరి వెంకటేశ్వర్లు, మండల స్పెషల్ ఆఫీసర్ విరూపాక్షి, పంచాయతీ కార్యదర్శి బైరం దినేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.