చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

Published: Thursday March 09, 2023
మధిర, మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి:
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని డిమాండ్ చేశారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్, మధిర సేవా సమితి, యూత్ కాంగ్రెస్, ముస్లిం మైనార్టీ సెల్, తదితరుల ఆధ్వర్యంలో మల్లు నందినిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలోనే సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. మహిళలు చట్టసభలోకి రావాలంటే తప్పనిసరిగా 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ప్రస్తుత మోడీ పాలనలో ప్రజలకు భద్రత లేదన్నారు. మహిళలందరికీ ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా మాజీ కౌన్సిలర్ కోన సుచరిత ధని కుమార్ దారా బాలరాజు పులిబండ్ల చిట్టిబాబు తూమాటి నవీన్ రెడ్డి, షేక్ జహంగీర్, ఎర్రా లక్ష్మణ్, అద్దంకి రవికుమార్, పారుపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు.