మెగా శ్రీ హాస్పిటల్ వైద్య సేవలు వేగవంతం మేఘ శ్రీ హాస్పిటల్స్ ప్రముఖ జనరల్ వైద్యులు టి పవన్ క

Published: Monday April 03, 2023
 బోనకల్, ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి: ప్రభుత్వ గుర్తింపు పొందిన మేఘశ్రీ హాస్పిటల్స్ వైద్య సేవలు వేగవంతం చేయనున్నామని హాస్పిటల్స్ ప్రముఖ జనరల్ వైద్య నిపుణులు టి పవన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మేఘ శ్రీహాస్పిటల్ నందు ప్రతి నెల మొదటి ఆదివారం బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో తూము ప్రకాశరావు జ్ఞాపకార్థం నిర్వహించే బిపి, షుగర్, కంటి ప్రత్యేక క్యాంపు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వైద్యులు పవన్ కుమార్ మాట్లాడుతూ... బిపి, షుగర్ తో బాధపడేవారు తప్పనిసరిగా మందులు క్రమం తప్పకుండా
వాడడం వల్ల బీపీ, షుగర్ లను అదుపులో ఉంచుకోవచ్న్నారు. బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నెలకు సరిపడ నాణ్యమైన మందులను అందజేస్తున్నట్లు, ఈ క్యాంపును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం సార్థకత అవుతుందన్నారు. దీనితో పాటు ప్రతి ఆదివారం అన్ని రకాల సర్జరీలు ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు . హాస్పిటల్ నందు వైద్య సేవలు పొందినటువంటి అర్హులైనటువంటి వారికి సీఎం సహా నిధికి దరఖాస్తు చేసుకోవడానికి బిల్స్ ను అందజేస్తున్నామన్నారు . అనంతరం ఈ క్యాంపులో 100 మంది పేషంట్లకు నెలకుసరిపడ మందులను బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తూము రోషన్ కుమార్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు, సీపీఐ మండల నాయకులు ఏలూరి పూర్ణచందు, బిజెపి జిల్లా కార్యవర్గసభ్యులు ఏనుగు సుమన్ బాబు, క్యాంపు నిర్వాహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాథ్, యంగల గిరి, పండగ గోపి తదితరులు పాల్గొన్నారు.