క్రాప్ లోన్ కట్టాలి అంటూ రైతుల సేవింగ్ ఖాతాలు లాక్ చేస్తున్న బ్యాంక్ అధికారులపై ప్రభుత్వం చ

Published: Friday December 03, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 2ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలం అరుట్ల గ్రామంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ బ్యాంక్ లో రైతుల క్రాప్ రుణాల విషయంలో బ్యాంక్ లో తీసుకున్న క్రాఫ్ రుణలు కట్టాలి తప్పకుండ లేక పోతే రినివల్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు రైతులను నాన ఇబ్బందులకు గురి చేస్తూ రైతుల సేవింగ్ ఖాతాలనుండి డబ్బులు తీసు కోకుండా లాక్ చేయటంతో రైతులు నాన ఆందోళన చెందుతున్నారు అత్యవసర పనులకు డబ్బులు తీసుకోవాలి అన్న ఎవరికైనా వేయాలి అన్న ఇప్పుడు పూర్తిగా ఆన్ లైన్ ద్వారా డబ్బులు  డ్రా చేసుకుంటున్నారు బ్యాంక్ అధికారులు క్రాప్ లోన్ ఉన్న రైతుల సేవింగ్ ఖాతాలు లాక్ చేయటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం పై బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే  అంత పై నుండే లాక్ చేస్తున్నారు అని డొంక తిరుగుడు సమాధానం చెపుతున్నారు ఈ సందర్భంగా మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష లోపు రుణాలు మపి చేస్తాం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు మార్లు మీడియాలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి గారి మాటలు పట్టించు కోకుండా బ్యాంక్ లో తీసుకున్న అప్పు కట్టాలి లేక పోతే రినవల్ చేసు కోవాలి అని బ్యాంక్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ  రైతులకు అవసరాలకు వేరే రుణాలు కానీ ఇతర ఎక్కడి డబ్బులు వచ్చిన రైతులు డబ్బులు డ్రా చేసు కోకుండా సేవింగ్ ఖాతాలు సైతం లాక్ చేసిన బ్యాంక్ అధికారులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లాక్ చేసిన రైతుల సేవింగ్ ఖాతాల లాక్ లు తొలగించాలి ముఖ్యమంత్రి కేసిర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తాం అని హెచ్చరిస్తున్నాం