గర్భిణీలు మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి: సర్పంచ్ భూక్య సైదా నాయక్

Published: Tuesday November 15, 2022
అంగన్వాడీ లో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం
ముఖ్య అతిధిగా ఏసి డిపిఓ కమల ప్రియ హాజరు
 
 
బోనకల్, నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం సామూహిక శ్రీమంతాలు , అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ భూక్య సైదా నాయక్, ఎసీడీపీఓ కమల ప్రియ హాజరయ్యారు. ఈ సందర్బంగా గర్బిణీలకు పండ్లు, పూలు అందజేసి ఆశీర్వదించారు. అదేవిధంగా వారికి కావలసిన ఐరన్, కాల్షియం తదితర మందులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు, శిశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
గర్బిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎసిడిపిఓ మాట్లాడుతూ గర్భిణీలు పోషకాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలని, అలాగే తల్లులు తమ పిల్లలకు ఆరు నెలలు వచ్చేదాకా తల్లిపాలు పట్టించాలని సూచించారు. మీరు ఉండే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ , పీహెచ్సీ సిహెచ్ఓ శ్రీనివాసరావు, ఏఎన్ఎం సరస్వతి, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, శిరీష, నాగమణి, ప్రసూనాంబ, ఆశాలు లీల, విజయ, తులసి, దుర్గ, అంగన్వాడి ఆయాలు, పలువురు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.