ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం

Published: Tuesday May 25, 2021
మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు
రాయికల్, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మున్సిపల్ తరుపున కోవిడ్ ఐసోలాషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నామని మున్సిపల్ చైర్మన్ మొరహనుమాండ్లు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు కిరాయి ఇండ్లలో ఉంటే యజమానులు అభ్యంతరాలు తెలపడం మరియు ఒకటే బాత్రూమ్ ఉన్న వారికి ఇబ్బంది జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. కావున మున్సిపల్ తరుపున కోవిడ్ ఐసోలాషన్ సెంటర్ పెడితే కరోనా వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ బాలిక పాఠశాల గదులను చూడడం జరిగింది. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అభ్యతరం తెలపడం వలన ఎక్కడ పెడితే బాగుంటుంది అనే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ మోర హనుమాండ్లు తెలిపారు.