నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోని లభిస్తుంది

Published: Friday June 17, 2022
పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కిరణ్
 
బోనకల్, జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి భాగంగా బ్రాహ్మణపల్లి ప్రభుత్వ పాఠశాల నందు తల్లిదండ్రుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి రవి కిరణ్ మాట్లాడుతూ తల్లి దండ్రులు విధిగా ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని,ఇంగ్లీష్ మీడియం విద్యను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు 100 శాతం హాజరు అయ్యేటట్లు తమ వంతు సహకారం అందించాలని తల్లిదండ్రులను కోరారు. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెర్రిపోతుల రవీంద్ర, ఎస్ఎంసి చైర్మన్ మడుపల్లి రమేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు రామకృష్ణ, ఉపాధ్యాయులు అన్నపూర్ణాదేవి, ఎం శశికుమార్, ఎస్కే రంజాన్ అలీ, ఎస్ రామకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.