ఎస్ సి వర్గీకరణ చేయాలని కొనసాగుతున్న రిలే దీక్షలు

Published: Monday August 01, 2022
మంచిర్యాల టౌన్, జూలై 31, ప్రజాపాలన: ఎస్ సి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు  కొనసాగించారు.   పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ, స్థానిక ఐ బి చౌరస్తా లో రిలే నిరాహార దీక్ష 3వ రోజు చేరగా ఆదివారం  ఎం ఎస్ పి  జిల్లా ఇన్చార్జి కల్వల శరత్ మాదిగ దండలు వేసి ప్రారంభించారు.ఈ దీక్షకు  అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామగిరి శ్రీపతి, అంబేడ్కర్ సంఘం జిల్లా చీఫ్ ఆర్గనైజర్ అట్కపురం రాయలింగు లు అంబేడ్కర్ సంఘం తరపున మద్దతు తెలిపారు. ఈ సదర్భంగా రామగిరి శ్రీపతి మాట్లాడుతూ ఎస్ సి ల వర్గీకరణ ఎ, బి, సి, డి  లుగా  చట్టబద్దత కోసం  మంద కృష్ణ మాదిగ  ఆధ్వర్యంలో గత  28 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తరుణంలో  బి జె పి పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్ సి లని వర్గీకరిస్తాం అని హామీ ఇచ్చి తీర కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వర్గీకరణ మాట మార్చడం బాధాకరం, వర్గీకరణ కోసం గల్లి నుండి ఢిల్లీ దాక సభలు సమావేశాలు మాదిగలు పెడితే  ఆ సభలకు,సమావేశాల కి వచ్చి వర్గీకరణ చేస్తాం అని మాదిగల కి హామీ ఇచ్చి మాట తప్పడం చాల బాధాకరం  అన్నారు.
ఈ నెల 2,3 తేదిలలో బి జె పి ప్రభుత్వం హైదరాబాద్ లో జాతీయ మహా సభలు నిర్వహించిన సందర్భంగా   ఏం ఆర్ పి ఎస్ నాయకులు శాంతి యుతంగా సభలో నిరసన తెలియచేస్తే నాయకుల మీద దాడి చేయడం మాదిగ సమాజం మొత్తం ఖండించడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే బేషరతుగా క్షేమాపన చెప్పి, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్ సి ల వర్గీకరణ కి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో  ఈ రిలే నిరాహారదీక్షలు ఆగష్టు 12వ తేదీ వరకు కొనసాగుతాయని  తెలిపారు. ఈ కార్యక్రామం లో   ఏం ఆర్ పి ఎస్ జిల్లా కో కన్వీనర్ సుదిళ్ళ మల్లేష్ మాదిగ, మంచిర్యాల నియోజకవర్గ కోఆర్డినేటర్ మంతెన మల్లేష్ మాదిగ,  మంచిర్యాల నియోజకవర్గ కన్వీనర్ చుంచు శంకర్ వర్మ, జిల్లా నాయకులు గద్దల బానయ్య మాదిగ మాజీ టౌన్ ప్రెసిడెంట్ చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, 
రెల్లి సంఘం నాయకులు గుడెపు సింహాచలం, మెతె పోశం,  జిల్లాపెల్లి సుగుణకర్ మాదిగ, చెన్నూరు విష్ణు మాదిగ,బోస్, అయిల్ల గణేష్ మాదిగ, జిలకర శంకర్ మాదిగ, పారునంది రమేష్ చంద్ర,గౌతమ్, సంతోష్, బానేష్, రాకేష్,రామచంద్రం, చరణ్,   తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area