కేశవపల్లిలో హనుమాన్ మందిర్ బీరప్ప జాతర ఉత్సవాలు * కేశవ పల్లి గ్రామ సర్పంచ్ మామిడిపల్లి సుధాక

Published: Thursday March 02, 2023
వికారాబాద్ బ్యూరో 01 మార్చి ప్రజాపాలన : నవాబుపేట్ మండల పరిధిలోని కేశవపల్లి గ్రామంలో హనుమాన్ మందిర్ బీరప్ప ఆలయాలలో ధ్వజ స్తంభాలను ప్రతిష్టించామని కేశవ పల్లి గ్రామ సర్పంచ్ మామిడిపల్లి సుధాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేశవపల్లి గ్రామం సుభిక్షంగా సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లేందుకు ఆరాధ్య దేవతలను భక్తి ప్రపత్తులతో భక్తులు కొలుస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ మందిర్ జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరము కూడా హనుమాన్ మందిర్ బీరప్ప గుడి దగ్గర ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశామని వివరించారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో శివలింగాలను ప్రతిష్టించారు. హనుమాన్ మందిర్ నుండి బీరప్ప గుడి వరకు భక్తులు ఊరేగింపుగా వెళ్లి బీరప్ప గుడి దగ్గర ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం హనుమాన్ మందిర్ దగ్గర ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనైనదని స్పష్టం చేశారు. గత మూడు రోజుల నుండి గ్రామంలో జాతర మహోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించామని వివరించారు. మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయనైనదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండు ఆలయ ధర్మకర్త ఎన్. నర్సింహారెడ్డి, గ్రామ పెద్దలు మహిపాల్ రెడ్డి ఏ రామ్ రెడ్డి ఏ నరసింహారెడ్డి శ్రీనివాస్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.