ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ

Published: Saturday July 23, 2022
బోనకల్, జులై 22 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని గ్రామంలో 2019 నుండి 2022 వరకు జరిగిన ఉపాధి హామీ పనుల వివరాలను సామాజిక తనిఖీ అధికారి (డి ఆర్ పి) సత్యనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది వారం రోజులపాటు గ్రామంలో తిరిగి కూలీల నుండి వివరాలు సేకరించారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభ ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామంలో జరిగిన పనుల వివరాలు అందులో ఉన్న లోపాలను గ్రామ సభ దృష్టికి డి ఆర్ పి సత్యనారాయణ తీసుకొచ్చారు. అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు సూచించిన కొలతల ప్రకారం పనులు చేసి అధిక వేతనం పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఏ పీ ఓ బసవోజు కృష్ణకుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు, ఈసీ కిరణ్ కుమార్, మండల వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, వార్డ్ మెంబర్ ఉప్పర శ్రీను, కో ఆప్షన్ నెంబర్ షేక్ మౌలాలి, పంచాయతీ కార్యదర్శి దామళ్ళ కిరణ్, పంచాయతీ సిబ్బంది నాగరాజు, రమేష్, గిరి, లక్ష్మణ, బాలకృష్ణ, గ్రామ ప్రజలు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area