చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి సతీమణి సీతా రంజీత్ రెడ్డి

Published: Friday January 07, 2022
వికారాబాద్ బ్యూరో 06 జనవరి ప్రజాపాలన : విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి సతీమణి సీతా రంజీత్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఆర్.ఆర్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్ననత బాలికల పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనేందుకు పాఠశాలలోని విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు ఆర్ ఆర్ ఫౌండేషన్ మెమొంటో, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సీతా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ  విద్యార్థినులు పోటీతత్వం కలిగి ఉండాలని  అప్పుడే జీవితంలో అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని గెలిచినట్టే నని అన్నారు. ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అలాగే చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సొంత నిధులతో అంబులెన్సులను, వికలాంగులకు  ట్రైస్కూటర్స్ పంపిణీ చేశామని కరోనా సమయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే  డాక్టర్ మెతుకు ఆనంద్  సతీమణి డాక్టర్  సబితా ఆనంద్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్, ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.