తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటుదాం

Published: Saturday September 17, 2022
 *షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పిలుపు* 
 
 *షాద్‌నగర్ లో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు* 
 
 *ఆర్డీఓ రాజేశ్వరి పర్యవేక్షణలో వేలాదిగా భారీ ర్యాలీ - సభ* 
 
ప్రజా పాలన ప్రతినిధి. షాద్నగర్.    హాజరైన అదనపు కలెక్టర్* *ప్రతిక్ జైన్, ఏసీపీ కుషాల్కర్, నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, నాయకులు తదితరులు* : ఆనాడు హైదరాబాద్‌ సంస్థానంలో ప్రజలు అణచివేతకు గురయ్యారు.. నిజాం పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎందరో నాటి నిజాం రాజ్య హింసకు గురయ్యారు. ఇలాంటి పోరాట పరిస్థితులలో నిజాం నవాబు ఉస్మాన్‌ అలీ ఖాన్‌ విధి లేని పరిస్థితుల్లో హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌ లో విలీనం చేశారని, ఆనాటి పోరాటంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రం చౌరస్తాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృతంలోని సైనిక దళం బాంబుల వర్షం కురిపించిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ గుర్తు చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ వేడుకలు ప్రారంభం అయ్యాయి. షాద్ నగర్ ఆర్డీఓ రాజేశ్వరి పర్యవేక్షణలో విద్యార్థులు వేలాదిగా భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, ఏసీపీ కుషాల్కర్, నియోజక వర్గ స్థానిక ప్రజా ప్రతినిధులు మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు.
స్థానిక రైల్వే స్టేషన్ నుండి మెయిన్ రోడ్ మీదుగా చౌరస్తాకు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం స్థానిక ఇండోర్ స్టేడియానికి ర్యాలీ చేరుకుంది. పెద్ద ఎత్తున ఏర్పాటైన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని వివరించారు. తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటుదాం అంటూ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఉత్సవాల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోటు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, స్వయంగా ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నేడు నియోజక వర్గములో ర్యాలీ కార్యక్రమాలు చేపట్టామని, అసెంబ్లీ నియోజకవర్గంలో  దాదాపు వేల మందితో ర్యాలీ నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటమాని అన్నారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని, రేపు జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.
భారత్‌ యూనియన్‌లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్‌ 17న జాతీయ జెండాను ఎగురవేయనున్నట్టు తెలిపారు. త్రేతా యుగంలో రాముడి పాలన, ద్వాపర యుగంలో కృష్ణుడి చతురత మాదిరిగా కెసిఆర్ పాలన పచ్చగా కొనసాగుతుందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల లక్ష్యంతో వచ్చిన ప్రభుత్వం బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఇంతమంది విద్యార్థులను చూసి ఆనందంగా ఉందని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలిరావడం పట్ల నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఆర్డీవో రాజేశ్వరి, జెడ్పిటిసిలు వెంకటరామిరెడ్డి, విశాల, ఎంపీపీ ఇద్రిస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంఈవో శంకర్ రాథోడ్ ఆయా మండలాల అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.. కేపి