ప్రత్యేక రాష్ట్రంలో పెన్షనర్లకు ప్రభుత్వం పెద్దపీట.

Published: Saturday December 17, 2022

ప్రత్యేక రాష్ట్రంలో పెన్షనర్లకు ప్రభుత్వం పెద్దపీట. -ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన పెన్షనర్లకు, సీనియర్ సీటీజన్స్ కు   ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్, సీనియర్ సీటీజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు సంజయ్ కుమార్ ను కలిశారు. ఎమ్మెల్యేగా 4 సంవత్సరాలు  విజయవంతంగా  పూర్తి చేసుకొని 5 వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా ఆయనకు 4 ఏళ్ళలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలిపే మెమోంటో అందించి ఘనంగా సన్మానించారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శనివారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షనర్స్ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హరి ఆశోక్ కుమార్ ను అభినందించారు. పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు  హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో 40 ఏళ్ళలో జరుగని అభివృద్ధిని 4 ఏళ్లలో సంజయ్ కుమార్ చూపించారని  కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో  ఉద్యోగులకు, పెన్షనర్స్ కు, జర్నలిస్ట్ ల కునగదు రహిత వైద్య సౌకర్యాలు కల్పన నిమిత్తం వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు వినతిపత్రం  ఇవ్వగా తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  పెన్షనర్స్ , సీనియర్ సీటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, పి.సి.హన్మంత్ రెడ్డి, ఎం.డి.యాకుబ్, కోశాధికారి వి.ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు  పి.ఆశోక్ రావు, కే.సత్యనారాయణ, రెవెన్యూ యాకూబ్, యూసుఫ్, కరుణ, సీనియర్ సీటీజన్స్, పెన్షనర్స్ జిల్లా, వివిధ మండల  ప్రతినిధులు పాల్గొన్నారు.