ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Published: Tuesday July 19, 2022
మంచిర్యాల టౌన్, జూలై 18, ప్రజాపాలన : ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశ వర్కర్స్ ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు  ఆధ్వర్యంలో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా   యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ లు మాట్లాడుతూ కరోనా సమయంలో  ప్రాణాలకు తెగించి  గ్రామాలలో  పని చేస్తే , ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు, ఈరోజు ప్రభుత్వం ఎలాంటి సర్వేలు చెప్పిన ముందుగా ఆశ  వర్కర్లకు అప్పగిస్తుంది. ఒకవైపు అధికారుల వేధింపులు , మరోవైపు చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవలని ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  కొత్త లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రమాద బీమా, పిఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా  సహాయ కార్యదర్శి  దాగం రాజారం, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శోభ,తదితరులు పాల్గొన్నారు.