బీపీ, షుగర్ పేషెంట్ లు ఎండలకు అప్రమత్తంగా ఉండాలి

Published: Monday May 02, 2022
బోనకల్, మే 1 ప్రజాపాలన ప్రతినిధి: ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో బీపీ, షుగర్ పేషెంట్ లు ఎండలకు అప్రమత్తంగా ఉండాలని మేఘ శ్రీ హాస్పిటల్ వైద్యులు టి పవన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో అమరజీవి తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్థం బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యం తో మేఘ శ్రీ హాస్పిటల్ నందు ఆదివారం నిర్వహించిన బీపీ, షుగర్ మెగా క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీ, షుగర్ పేషెంట్ లకు ఎండలకు బీపీ, షుగర్ హెచ్చుతగ్గులు ఉంటాయని, వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు ఉపయోగించాలన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 48 శాతం మంది బిపి, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారని, రాబోయే తరాలకు ఈ వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లు నియంత్రణ, మానసిక ఒత్తిడిని తగ్గించడం తదితర పద్ధతుల ద్వారా బిపి, షుగర్ అరికట్టవచ్చని వారు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. ఈ క్యాంపును మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, బత్తినేని ట్రస్ట్ సభ్యులు తూము రోషన్ కుమార్ ,సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, ప్రముఖ దంత వైద్య నిపుణులు ఎస్ ఉదయ్ కిరణ్, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండల రావు , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్, ఏలూరి పూర్ణచంద్రరావు, మెదరమెట్ల నాగేశ్వరరావు, క్యాంప్ నిర్వాహకులు ఆకెన పవన్, సాధనపల్లి అమర్ నాధ్ తదితరులు పాల్గొన్నారు.