బెల్లంపల్లిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

Published: Monday March 14, 2022
బెల్లంపల్లి, మార్చి 13, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఆదివారం  బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ లు & కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, బెల్లంపల్లి నియోజకవర్గ పార్టీ యువజన అధ్యక్షుడు మహేష్ గౌడ్, బెల్లంపల్లి పట్టణ పార్టీ యువజన అధ్యక్షుడు సన్నీబాబు, టిఆర్ఎస్ వి. యూత్ జాగృతి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.