భూస్వామ్య సమాజాన్ని కూల్చి నూతన సమాజాన్ని ఆవిష్కరిద్దాం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ఎం .

Published: Friday November 04, 2022

బోనకల్ ,నవంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో లక్ష్మీపురం గ్రామంలో అమరవీరుల వార్షికోత్సవాల భాగంగా గురువారం గ్రామ సెంటర్లో జరిగిన సభా కార్యక్రమంలో ఎం గిరి మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి నక్సల్ బరి పోరాటం వరకు ఎందరో పీడిత ప్రజలు విముక్తి కోసం సమ సమాజ స్థాపన కోసం పోరాడి అమరులయ్యారని, వారి ఆశల బాటలోనే ముందుకు పోవాలని అదే సరైన దారిణిమరో దారి లేదని ఆయన అన్నారు. 1969 నుండి నేటి వరకు ఏలాదిమంది నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ ఉద్యమంలో అసువులు బాపారని, ఈ అర్థ వలస అర్ధ భూస్వామ్య సమాజాన్ని కూల్చి నూతన సమాజ ఆవిష్కరణ కోసం తమ చదువులు నీ జీవితాలని కుటుంబాలని వదిలేసి ప్రజలే సర్వసరంగా భావించి తమ రక్తాన్ని ఈ సమాజ మార్పు కోసం ధారపోసారని వారి ఆశలను కొనసాగించడమే మనవారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. భారత పాలకవర్గాలు విప్లవఉద్యమాన్ని అణిచివేయటం కోసం వేలాది మందిని ఎన్కౌంటర్ పేరుతో హత్య లు చేసిందని ఆరోపించారు. అయినా ఉద్యమం ముందుకే పోతుందని దోపిడీ ఆకలిఉన్నంతవరకు విప్లవ ఉద్యమానికి అంతం లేదని అన్నారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి కు చెందిన ధర్మన్న, ముష్టికుంట గ్రామానికి చెందిన జక్కా తిరుపతయ్య, పెద్ద గోపన్న చిన్నపిల్లల డాక్టర్ రామనాధాన్ని కాల్చి చంపారని ఆయన ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంపన్న వర్గాలకు ప్రజల సంపదను కట్టబెట్టి కోట్లాదిమంది ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని ప్రజల శ్రమతో నిర్మించుకున్న అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను తన అనుకూల మనుషులకి కట్టబెడుతుందని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని రెండు రకాలుగా తయారు చేసిందని సంపన్నుల భారతదేశం పేదల భారతదేశంగా మార్చివేసిందని,ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా పత్తి పంట చాలా దెబ్బ తిన్నదని, వచ్చిన కొద్దిపాటి దిగుబడిని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పత్తి కింటాకు 15000 వేల రూపాయలకు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దప్రోలు వెంకటేశ్వర్లు, ఏం రామారావు, డి నాగయ్య ,గోవిందరావు రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.