ఘనంగా ఆత్మీయ వీడ్కోలు ఇచ్చిన సర్కిల్ పోలీస్ శాఖ

Published: Tuesday June 28, 2022

మధిర జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలను పూర్తిచేసిన ట్రైనీ ఐపీఎస్ అధికారి సంకీర్త్మధిర సిఐ వడ్డేపల్లి మురళి ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు ఇచ్చిన పోలీసులుమధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా ఏప్రిల్ 4న బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి సంకీర్త్ విజయవంతంగా బాధ్యత పూర్తి చేశారు. సంకీర్త్ ఎస్ హెచ్ ఓగా ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా ఆదివారం రాత్రి సర్కిల్ కార్యాలయంలో సీఐ వడ్డేపల్లి మురళి ఆధ్వర్యంలో సంకీర్త్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ రూరల్ ఎస్ఐలు సతీష్ కుమార్ నరేష్ పాల్గొన్నారు.