దిగివస్తున్న ద్రవ్యాలబలం.. కాస్త తగ్గుముఖం పట్టిన ఆహార వస్తువుల ధరలు...

Published: Tuesday January 10, 2023

బూర్గంపాడు (ప్రజా పాలన ప్రతినిధి.)

దేశంలో ద్రవ్యోల్బణం దిగొస్తోంది. చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠ స్థాయికి చేరి నవంబర్ లో 5.88 శాతంగా నమోదైంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఇది 6.77 శాతంగా ఉండగా...గత ఏడాది నవంబర్ లో 4.67 శాతంగా నమోదైంది. ఆహార వస్తువుల ధరలు కాస్త దిగిరావడం ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమైంది. ఈ ఏడాది జనవరి నుంచి రిజర్వ్ బ్యాంక్  పెట్టుకున్న ఎగువ హద్దు 6 శాతం కంటే ఎక్కువగా నమోదైన ద్రవ్యోల్బణం ప్రస్తుతం కాస్త తగ్గింది. గత వారం వడ్డీరేట్ల పెంపు సందర్భంగా అత్యంత దారుణమైన 0ద్రవ్యోల్బణం మన వెనుక ఉందని రిజర్వ్  బ్యాంక్  వ్యాఖ్యానించింది. ధరల పెరుగుదల వ్యతిరేక పోరాటంలో అలసత్వానికి తావులేదని తెలిపింది. వచ్చే 12 నెలలు కూడా ద్రవ్యోల్బణం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని రిజర్వ్  బ్యాంక్  అంచనా వేసింది.