సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కడివెండి గ్రామం లో వైద్య పరీక్షల నిర్వహణ - డాక్టర్. కిషోర్ తాల్క

Published: Saturday July 30, 2022

హైదరాబాద్ 29జులై ప్రజాపాలన:

సీజనల్ వ్యాధులు వ్యాపించ కుండా శుక్రవారం నాడు కడివెండి గ్రామం దొడ్డి కొమురయ్య భవనం లో దేవురుప్పల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో కలెక్టరు మరియు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సంబంధిత డాక్టర్ కిషోర్ కుమార్ తాల్క తెలియజేసారు. మండలంలో గత కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీల వారి గా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి బెత్లీనా రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బస్వా సావిత్రి మల్లేశం హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నూట యాభై నాలుగు గ్రామస్తులకు దగ్గు, జలుబు, జ్వరం కేసులను గుర్తించి పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించి ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్

హెల్త్ ఆఫీసర్ ఆదేశాల మేరకు

మండల పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వాక్సినేషన్ బూస్టర్ డోస్ పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారికి ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం అన్ని గ్రామ పంచాయతీల వారీగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటిస్తు మాస్క్ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, రామ్‌మూర్తి, ల్యాబ్ టెక్కీషియన్ శ్రీనాధ్, ఏఎన్‌ఎం సిహెచ్ జ్యోతి, సరిత ఆశా వర్కర్లు పాల్గొన్నారు