మున్సిపాలిటీలో పలుఅభివృద్ధి పనులు వేగవంతం చేయాలిజిల్లా కలెక్టర్ విపి గౌతమ్

Published: Thursday October 27, 2022

మధిర అక్టోబర్ 26 (ప్రజాపాలన ప్రతిని మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలుఅభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విపి గౌతం సూచించారు. బుధవారం పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ట్యాంకు బండ, సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వర త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మధిర పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఐదు కోట్ల రూపాయలతో మధిర చెరువు కట్టను ట్యాంకుబండగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రజలకు కావలసిన అన్ని రకాల నిత్యవసర వస్తువులు తోపాటు మాంసాహారం సైతం ఒకే చోట దొరికే విధంగా ఐదు కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ ఎదురుగా సమీకృత మార్కెట్ను నిర్మిస్తున్నట్లు అని తెలిపారు అదే విధంగా పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో 36 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి సకాలంలో  పూర్తి చేయాలన్నారు. నూతన సంవత్సరం జనవరిలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత ఆర్డీవో రవీంద్రనాథ్ డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లత కౌన్సిలర్ మల్లాది వాసు ఐబి డిఈ నాగబ్రహ్మం ఎంపీపీ మెండెం లలిత ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ అంబటి రమాదేవి ఏఈ నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.