రేగా యూత్ ఆధ్వర్యంలో సారపాకలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కా

Published: Saturday December 10, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)

ఈరోజు బూర్గంపాడు మండలం సారపాక, బ్రిలియంట్ హైస్కూల్లో జరుగుతున్నటువంటి రేగా యూత్  షటిల్ టోర్నమెంటుకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత .ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి షటిల్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేగ యూత్ ఆధ్వర్యంలో సారపాకలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని క్రీడలు అనేవి మానసికంగా శారీరకంగా ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయని క్రీడాకారులు దృఢంగా ఉండటానికి క్రీడలు ఎంతో బాగా ఉపయోగపడతాయని వారికి సందర్భంగా అన్నారు.. క్రీడల్లో రాణించి భద్రాచలానికి చెందిన యువతి త్రిష అండర్ 19 ఇండియన్ క్రికెట్ మహిళ  టోర్నమెంట్ కు ఎంపికవడం అందుకు ఉదాహరణ అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత మరియు మైనార్టీ మండల అధ్యక్షుడు గుల్ మహమ్మద్, యువజన విభాగం ఖాదర్ మరియు సారపాక  టౌన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, శంకర్ రెడ్డి ,బెజ్జంకి కనక చారి, చెలికాని శివ, మోహన్ ,సాయి బాబా, సురేష్, ఆంజనేయులు ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.