ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *సిఐటియు 17వ అఖిలభారత మహాసభల జయప్రదానికై జం

Published: Wednesday January 11, 2023

సిఐటియు అఖిలభారత 17వ మహాసభలు బెంగుళూర్ లో జనవరి 18 నుండి 22వరకు జరగనున్న నేపథ్యంలో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సీఐటీయూ అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాగన్నగూడలోని సిఐటియు తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా ఉపాధ్యక్షులు డి కిషన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాడిగళ్ల భాస్కర్ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేకుండా పోరాడుతున్న సిఐటియు అఖిల భారత 17 మహాసభలు బెంగళూరు లో ఈనెల 18 నుండి 22 వరకు జరగనున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయడం కోసం కార్మిక వర్గాన్ని సంసిద్ధులను చేయడం కోసమే జండా ఆవిష్కరణలు చేస్తున్నామని అన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులతో శ్రమ దోపిడీ చేయించుకుంటూ దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడుదారులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, ఒకవైపున రైతు వ్యతిరేక చట్టాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ  ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో జరగనున్న సిఐటియు అఖిలభారత మహాసభలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని అన్నారు భవిష్యత్తులో నరేంద్ర మోడీ విధానాలపై పోరాడేందుకు మహాసభల్లో అనేక అంశాలను చర్చిస్తామని తద్వారా పోరాటాలకు కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి జగదీష్ సిఐటియు నాయకులు గుర్రం జంగయ్య, ఎన్. యాదయ్య, బిక్షపతి మురళి మేతరి నవీన్ కుమార్ మంకాల రవి వెంకటయ్య మున్సిపల్ కార్మికులు జంగమ్మ అందాలు యాదమ్మ నర్సమ్మ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు,